Breaking News

పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సులబ్ సంస్థ ప్రతినిధులు, ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీపురం, బ్రాడీపేట ప్రాంతాల్లో పబ్లిక్ టాయ్ లెట్స్, ఇన్నర్ రింగ్ రోడ్ లో అభివృద్ధి పనులు, భారత్ పేటలో పిజిఆర్ఎస్ లో అందిన ఫిర్యాదును పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత టాయిలెట్ల శుభ్రత, నిర్వహణ, నీటి సదుపాయం, వినియోగదారులకు కల్పిస్తున్నసౌకర్యాలను పరిశీలించి, కొన్ని చోట్ల లోపాలు కనిపించడంతో సంబంధిత అధికారులకు తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్‌లో నిరంతర నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలని, అలాగే ప్రజలు తమ సమస్యలను నమోదు చేసేందుకు ఫిర్యాదుల పుస్తకం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. టాయిలెట్ల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత రుసుము మాత్రమే వసూలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు వసూళ్లు జరగకూడదని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో చేపట్టిన రోడ్ ప్యాచ్ వర్క్ లను పరిశీలించి, ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు ఏఈల వారీగా నాణ్యతతో చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలన్నారు. భారత్ పేటలో పిజిఆర్ఎస్ ఫిర్యాదుని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఈఈ వేణు గోపాల్, డిఈఈ సతీష్ కుమార్, ఎస్ఎస్ ఐజాక్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *