Breaking News

దోమలపై దండయాత్ర పేరుతో అవగాహన మానవహారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధుల్లో స్వచ్చత, ఆరోగ్యం పట్ల కల్గించే అవగాహన యావత్ ప్రజానీకానికి వేగంగా చేరుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. శనివారం అభ్యుదయ మహిళా విద్యా సంస్థల డైరెక్టర్ బి.రోహిణి దేవి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని మధర్ థెరిస్సా విగ్రహం దగ్గర దోమలపై దండయాత్ర పేరుతో జరిగిన అవగాహన మానవహారం, ఫ్లాష్ మాబ్ లో కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్చ ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక థీమ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గుంటూరు నగరంలో కూడా వివిధ వార్డ్ ల వారీగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యుదయ మహిళా విద్యా సంస్థలు దోమలపై దండయాత్ర పేరుతో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత తద్వారా అందే ఆరోగ్యం పై అవగాహన కల్గించడానికి ముందుకు రావడాన్ని నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. విద్యార్ధులే భావి భారత నిర్మాతలని, వారిలో ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్చత పట్ల అంకితభావం కల్గించగలిగితే స్వచ్చ గుంటూరు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాకారమవుతుందన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రాదా మాధవి, రోటరీ క్లబ్ ఆదర్స్ ప్రెసిడెంట్ అనురాధ, పి.సత్యవాణి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *