Breaking News

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది : యార్లగడ్డ

-విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వవ్యాప్తంగా ఎక్కువమంది ప్రజలు జరుపుకునే క్రిస్మస్, సెమిక్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం గన్నవరం మండలం దావాజీగూడెంలోని ఎస్సీ కాలనీలో గల సీఎస్ఐ చర్చ్ 28వ వార్షికోత్సవం, సెమిక్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చర్చ్ పాస్టర్ కాటుమాల నతానియల్ బాబురావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రభువు దీవెనలు అందజేశారు. ఈ సందర్బంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన యార్లగడ్డ మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సేవ అనే విలువలను ఏసు ప్రభువు తన సందేశం ద్వారా అందించారని గుర్తు చేశారు. ఎన్నో క్రైస్తవ సంస్థలు మనదేశంలో సమాజ సేవలో పాల్గొంటున్నాయని, నిరక్షరాస్యత నిర్మూలనలోనూ క్రైస్తవ సంస్థల కృషి స్లాఘనీయమన్నారు. దావాజిగూడెం గ్రామంలో ఎయిర్పోర్ట్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు కౌలు సమస్య ఉందని వారం పది రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని హామీ ఇచ్చారు. దావాజీగూడెం ఉన్నత పాఠశాలలో స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే శాప్ చైర్మన్ ను కోరానని, త్వరలో స్టేడియం నిర్మాణం సాకారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లోగా మండల పరిషత్, గ్రామపంచాయతీ నిధులతో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయాలని యార్లగడ్డ ఆదేశించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు గొంది శివకోటేశ్వరావు 300 మంది మహిళలకు ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, టిడిపి నాయకులు గొంది నరేంద్ర, కొసరాజు రాము, మద్దినేని వెంకటేశ్వరరావు, బడుగు ఝాన్సీ, కారంపూడి సాంబయ్య, కారంపూడి కుమార్, సుకన్య, బోడపాటి రవి, బొప్పిడి ప్రవీణ్, ధర్మారావు, తిరువీధి సుబ్బారావు తిరువీధి సురేష్, పండు బాబు, దొరబాబు, తిరువీధి ఫణీంద్ర, అశోక్, పులి రవి, జనసేన నాయకులు చిమటా రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *