Breaking News

సంక్రాంతి పండుగ సందర్భంగా గోడప్రతిని ఆవిష్కరణ

-నగరంలో మంగళవారం జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13న మంగళవారం ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహణ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో గోడప్రతిని ఆవిష్కరించారు. ఈ పోటీలు 13-01-2026 (మంగళవారం) ఉదయం 8.30 గంటల నుంచి రాజమహేంద్రవరం నగరంలోని ప్రభుత్వ ఎస్.కె.వి.టి. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్‌ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలతో ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించడం, శారీరక దృఢత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా ఉత్తర్వుల మేరకు ఈ పోటీలను తూర్పు గోదావరి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నిర్వహించ నున్నట్లు జిల్లా క్రీడా అధికారి డి.ఎం.ఎం. శేషగిరి తెలిపారు.

ఈ పోటీల్లో. ……
మహిళలకు : స్కిప్పింగ్ రోప్ (తాడాట), తొక్కుడు బిళ్ల పురుషులు & మహిళలకు : కర్రసాము, టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుడు) పురుషులకు : ఏడు పెంకులాట, గాలిపటాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, అదనపు ఎస్పీ ఎల్. చెంచు రెడ్డి, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా స్పోర్ట్స్ అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి, పీఆర్వో ఎమ్ లక్ష్మణా చార్యులు, డి ఈ వో కె వాసుదేవ రావు, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *