-ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలి
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దిశ, రాజ్యాంగ స్పూర్తి, ప్రజా సాధికారతను ప్రతిబింబించే విధంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ (FAC) జాయింట్ కలెక్టర్ Mr. వై మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా వేడుకలు రూపకల్పన చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశంలో ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత కాలంలో చేపట్టిన ప్రాధాన్యత కలిగిన సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల సారాంశంగా వేడుకలు ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను మాత్రమే ప్రతిబింబించే శకటాల ప్రదర్శనతో పాటు వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయవలసి ఉందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా డి ఆర్ డి ఏ, డ్వామా పిడి లు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లు, జాతీయ జెండా ఆవిష్కరణ, పరేడ్ తదితర అంశాలను పోలీసు అధికారులు ఏర్పాటు చేయాలని, రాజమహేంద్రవరం ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని పర్యవేక్షించాలని సూచించారు. స్టేడియంలో జరిగే ఏర్పాట్లు ఆర్‌ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని సీటింగ్ , గ్రాండ్ ప్రిపరేషన్, గ్యాలరీ తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టడం పై సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి, రాజ్యాంగ , దేశభక్తి విలువలు ప్రతిబింబించేలా ఉండే విధంగా జిల్లా పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైర్, వైద్య–ఆరోగ్య, మున్సిపల్, పోలీస్ శాఖలు సమగ్ర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.. ప్రసంగ పాఠం డిపీఆర్వో – సిపివో తో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
అలాగే అవార్డుల ఎంపికలో రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రతిభ కనబరిచిన వారి పేర్లను మాత్రమే సిఫార్సు చేయాలని స్పష్టం చేశారు. వేడుకలు పూర్తిగా పారదర్శకంగా, క్రమబద్ధంగా, ప్రజలకు ప్రభుత్వ విజన్‌ను తెలియజేసేలా ఉండాలని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ టి. సీతారామమూర్తి, అదనపు ఎస్పీ ఎల్. చెంచిరెడ్డి, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, డీఆర్‌డీఏ పీడీ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, ఆర్మ్డ్ డీఎస్పీ రవికుమార్, హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఐసీడీఎస్ పీడీ టి. శ్రీదేవి, డీఎస్వో వి. పార్వతి, సీపీవో ఎల్. అప్పలకొండ, డీఈవో కె. వాసుదేవరావు, డీటీవో ఆర్. సురేష్, డివిజనల్ పీఆర్వో ఎం. లక్ష్మణా చార్యులు, డీటిడబ్ల్యూడబ్ల్యో కె.ఎన్. జ్యోతి, బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News