రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి కోటగుమ్మం, రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహంను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో ఆమె మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య, బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె సూచనలు చేస్తూ, వ్యసనాలకు మరియు చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువు కోవాలని హితవు పలికారు. క్రమశిక్షణ, సహనశీలత ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన లక్షణాలని, వాటిని అలవరుచుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. అలాగే ఉచితంగా న్యాయ సహాయం పొందడం తమ హక్కు అని బాలురకు వివరించారు. పర్యవేక్షణ గృహంలో ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News