Breaking News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయం రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా బాలల సంరక్షణ కేంద్రాలు నడుపుతున్న సంస్థలు మరియు వ్యక్తులకు తెలియజేయునదేమనగా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 మరియు సవరించబడిన చట్టం, 2021 లోని సెక్షన్–41 ప్రకారం, అలాగే జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) నిబంధనలు, 2016 మరియు సవరించబడిన నిబంధనలు, 2022 లోని నిబంధన–21 ప్రకారం, ‘రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల’ కొరకు మరియు ‘చట్టంతో విభేదించిన పిల్లల’ కొరకు నడుపబడుతున్న బాలల సంరక్షణ కేంద్రాలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసినదిగా ఆదేశించబడినది. ప్రభుత్వం ద్వారా గానీ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా గానీ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గానీ, ప్రభుత్వ నిధులు లేకుండా గానీ నడుపబడుతున్న బాలల సంరక్షణ కేంద్రాలు, ఇతర ఏదైనా చట్టం క్రింద లైసెన్సు పొందినప్పటికీ, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 లోని సెక్షన్–41 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసినదిగా సంచాలకులు, బాలల సంక్షేమము మరియు సంస్కరణల సేవల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలియజేశారు. అందువలన, బాలల సంరక్షణ కేంద్రాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉద్దేశించిన వారు, నిర్దేశిత ప్రొఫార్మాలో పూర్తిగా నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధృవపత్రాల ప్రతులు జతచేసి, 13.02.2026 లోగా కింది చిరునామాలలో ఏదైనా ఒక కార్యాలయానికి సమర్పించవలెను. జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయం, నెం. 31-5-37, మోచి వీధి, బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం – 533101 లేదా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారిత అధికారి కార్యాలయం, మహిళా ప్రాంగణం, బొమ్మూరు, రాజమహేంద్రవరం – 533126 దరఖాస్తులను స్వయంగా కార్యాలయానికి వచ్చి గానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ సమర్పించవచ్చును. ఈ విషయానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, చిరునామాలు, అవసరమైన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ మొదలైన వివరాల కోసం కింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును. వై. చంద్రశేఖర్, అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి – 9100045425 ఆర్. ఆనంత ప్రదీప్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, రాజమహేంద్రవరం – 8330969889

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *