రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త
ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు – ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యం నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ pgrs హాల్ లో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అర్జిల పరిష్కార విధానం పై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారితనం, పారదర్శకతతో కలిగి పౌర సేవలు అందించాలన్నారు. రెవెన్యూ క్లినిక్‌ల ముఖ్య ఉద్దేశ్యం జవాబుదారితనం, పారదర్శకత కలిగి ఉండడమేనని అన్నారు. ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపి, వారి సంతృప్తి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే రెవెన్యూ సమస్యలను అదే స్థాయిలో తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో అర్జీల పరిష్కార విధానంపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించే విధానం, ప్రజలతో వ్యవహరించే తీరు, డబ్బులు వసూలు చేయడం, అర్జీలు స్వీకరించిన సందర్భంలో రసీదు ఇవ్వడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన, ధృవీకరణ పత్రాల జారీ వంటి అనుబంధ అంశాలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనా వ్యవస్థలోని లోపాలను అధిగమించే దిశగా అందరూ తమ పనితీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే గణనీయమైన మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, ఇంకా మరింత అభివృద్ధి సాధించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎండార్స్‌మెంట్ ఇచ్చే సమయంలో సరైన, హేతుబద్ధమైన జవాబు ఇవ్వడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొబేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కృష్ణ చైతన్య, డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత, ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, పి భాగ్యవతి, సీపీవో ఎల్ అప్పల కొండ, డీఎస్పీ బి . విద్య, డి డి వో పి వీణా దేవి , ఇతర జిల్లా అధికారులు, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.a
Prajavartha Online Telugu News