Breaking News

“యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే విజయవంతానికి ప్రజల సహకారం అవసరం

– రాజమహేంద్రవరం రూరల్ – 64,123లో 31,624 (49.32%)
– నల్లజర్ల – 29,271లో 16,728 (57.15%)
– దేవరపల్లి – 27,281లో 16,779 (61.50%)
– రాజానగరం – 38,760లో 25,149 (64.88%)
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు విధాన రూపకల్పన, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, లబ్ధిదారులకు సేవలు ముందస్తుగా అందించేందుకు అవసరమైన సమగ్ర డేటాను సేకరించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే RTGS డేటాను పూర్తి స్థాయిలో సక్రమంగా నమోదు చేసి దాని నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యమన్నారు. ఈ సర్వే నిర్వహణ బాధ్యతను స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. సర్వే నిమిత్తం సిబ్బంది గృహాలకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ/ఉద్యోగ వివరాలు (ఉంటే), విద్య, ఆస్తులు, వాహనాల వివరాలు అందజేయాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు రద్దు కావచ్చని హెచ్చరించారు. జిల్లాలో ప్రతిరోజూ 30,000 కుటుంబాల సర్వే లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో సుమారు 12 శాతం మాత్రమే పూర్తవుతున్నందున ప్రజల సహకారం అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులు, అనుబంధ యూనిట్లలో విధులు నిర్వహిస్తున్న వారు అధికంగా ఉన్నందున అవసరమైన పత్రాలు అందించి సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
20.02.2026 మధ్యాహ్నం 01.00 గంటల నాటికి జిల్లాలో మొత్తం 7,29,662 కుటుంబాల్లో 5,30,962 కుటుంబాల సర్వే పూర్తై 72.77 శాతం పురోగతి నమోదైందన్నారు. మండలాల వారీగా గోకవరం (90.83%), పెరవలి (86.45%), నిడదవోలు (U) (86.46%), కోరుకొండ (86.30%) వంటి మండలాలు అత్యధిక శాతం సాధించాయి. ఈ నెలాఖరు నాటికి 100 శాతం సర్వే పూర్తి లక్ష్యం దిశగా ప్రతి రోజు 30,000 వేల కుటుంబాలు లక్ష్యం నిర్ణయించడం జరిగిందన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించే సిబ్బందికి అధికారులు ఇవ్వాలని కోరారు.

తక్కువ పురోగతి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి –
కలెక్టర్ ఆదేశాలు రాజమహేంద్రవరం రూరల్ (49.32%), నల్లజర్ల (57.15%), దేవరపల్లి (61.50%), రాజనగరం (64.88%) మండలాల్లో పురోగతి తక్కువగా ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సంబంధిత మండలాల అధికారులు, స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పెండింగ్ కుటుంబాల సర్వే వేగవంతం చేయాలని సూచించారు.
ప్రజలు అందుబాటులో ఉండి అవసరమైన సమాచారం, పత్రాలు సమర్పించడం ద్వారా ఈ సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతి కుటుంబం సమగ్రంగా నమోదై సంక్షేమ పథకాల లబ్ధి అందుకునేలా అందరూ సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *