గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ) డ్రైవ్ చేపట్టామని, ఏబీసి సెంటర్ అందుబాటులోకి వచ్చే లోపు వీలైనన్ని కుక్కలకు చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిఎంసి వెటర్నరీ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో నల్లచెరువు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో 18 వీధి కుక్కలను పట్టుకొని ఏఆర్వీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వార్డ్ ల వారీగా వీధి కుక్కల సమస్యలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, త్వరలో ఏబీసి సెంటర్ కూడా అందుబాటులోకి రానున్నందున, ప్రస్తుతం కుక్కలకు ఏఆర్వీ చేయిస్తున్నామన్నారు. అగ్రెసివ్ గా ఉన్న వాటిని పట్టుకొని, విఏఎస్ బృందం అబ్జర్వేషన్ చేస్తున్నారన్నారు. ఫిర్యాదులు అందిన ప్రాంతాల వారీగా జిఎంసి సిబ్బంది ప్రత్యేక వాహనంలో ఏఆర్వీకి తరలిస్తున్నామన్నారు. ఏఆర్వీ అనంతరం ఎక్కడ పట్టుకున్నామో అక్కడే వదులుతున్నామని తెలిపారు. నగర ప్రజలు కూడా ఎక్కడైనా వీధి కుక్కలు అగ్రెసివ్ గా ఉండడం గమనిస్తే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి తెలియచేయాలని కోరారు.
Prajavartha Online Telugu News