Breaking News

ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆయా అర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. స్తానిక సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారంకు సంబంధిత అధికారి భాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని, చేయలేకుంటే తగు వివరాలతో ఫిర్యాదికి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని, జీరో బియాండ్ ఎస్ఎల్ఏ నిర్వహించాలన్నారు. సోమవారం జరిగే కార్యక్రమానికి గత వారం అందిన ఫిర్యాదులు పరిష్కార నివేదికతో అధికారులు హాజరుకావాలన్నారు. ప్రతి విభాగంలో పిజిఆర్ఎస్, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. అర్జీల పరిష్కారంపై విభాగాధిపతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 56 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 20, ఇంజినీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 13, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *