Breaking News

నిర్దేశిత ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ నుండి పొందిన నిర్దేశిత ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలని, ప్లాన్ లేకుండా లేదా ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం శ్యామల నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాలను పరిశీలించి, ఇన్నర్ రింగ్ రోడ్ లో ఒక భవనం ప్లాన్ కి భిన్నంగా సెల్లార్ లో అదనపు రూమ్ ఏర్పాటుపై సంబందిత టిపిఓకి షోకాజ్ జారీ చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వార్డ్ ల వారీగా నిర్మాణ సమయంలోనే జిఎంసి నుండి తీసుకున్న ప్లాన్ కి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా ప్లానింగ్ కార్యదర్శులు, టిపీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆక్యుపెన్సీ, మార్ట్ గేజ్ మంజూరు ఫైల్స్ తమకు పంపే ముందే సిటి ప్లానర్ తరువుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రీనరీకి కేటాయింపు సరిగా ఉండడం లేదని, సెట్ బ్యాక్ లో కూడా ట్రాన్స్ ఫారాలు, జనరేటర్లు ఉంటున్నట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తేనే తదుపరి అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. శ్యామల నగర్ లో ఆక్యుపెన్సీకి దరఖాస్తు భవనం ముందు డ్రైన్ శుభ్రం చేయడానికి గ్రిల్స్ ఏర్పాటు బాగుందని, అలాగే ఇతర అపార్ట్మెంట్లకు కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలియచేయాలన్నారు. బృందావన్ గార్డెన్స్ రోడ్, కుందుల రోడ్ విస్తరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పనులను వేగవంతం చేయాలన్నారు. కుందుల రోడ్ లో రైతు బజార్ ప్రతిపాదిత జిఎంసి స్థలాన్ని, కాకుమానువారితోటలో కార్మిక శాఖా స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుందుల రోడ్ లోని రైతుబజార్ లో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపీ సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈ విష్ణు, ఎస్ఎస్ లు ప్రసాద్, సాంబయ్య, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, సర్వేయర్లు లక్ష్మీ నారాయణ, సుభాని, కార్పొరేటర్ ఈ.వర ప్రసాద్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *