Breaking News

ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుప్రక్కల జెరాక్స్ మెషిన్ దుకాణాలు మూసివేయడం అంశాలను గురించి వాకబు చేశారు. పరీక్షల సమయంలో అనవసరపు వదంతులకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేశారు. ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 87 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *