Breaking News

కల్తీ పాల, కలుషిత జలాల సమస్యపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష

-జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశా నిర్దేశం

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ ఎం సి, పశు సంవర్ధక శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అమరావతి నుంచి తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజా ప్రతినిధులతో కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించండం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలని పేర్కొన్నారు. సమస్యలను మూలం నుండే గుర్తించి, ఎటువంటి ఉదాసీనతకు తావు లేకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుసరించి క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డేటా విశ్లేషణ కు సంబంధించిన సేకరించిన సమాచారం సరైన విధంగా విశ్లేషించి, సమస్య పరిష్కార మార్గాలను రూపొందించాలన్నారు. సిద్దాంతాత్మకంగా కాకుండా ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఫలితాల మీద దృష్టి పెట్టాలన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆడిట్ ఫలితాలు, ల్యాబ్ రిపోర్టులు క్షేత్ర స్థాయి పరిశీలనలతో సమ్మిళితం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆమేరకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా, నిరంతర పర్యవేక్షణ చెయ్యడం ముఖ్యం అన్నారు. శనివారం మరో సారి సమీక్ష నిర్వహించండం జరుగుతుందనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి జిల్లాలో కల్తీ పాల ఘటన వివరాలు తెలియ చేస్తూ, ఈ సమాచారం తెలిసిన వెంటనే తగిన చర్యలు చేపట్టడం ప్రారంభించామని తెలియ చేశారు. ఘటన జరిగిన నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన వృద్ధులు నలుగురు ఫిబ్రవరి 22న అడ్మిషన్ అయ్యారని తెలిపారు. బాధితులు అనూరియా (మూత్ర విసర్జన లేకపోవడం), వాంతులు, కడుపు నొప్పి, డయాలసిస్ అవసరమయ్యే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో చౌడేశ్వర నగర్, స్వరూప నగర్, లాలా చెరువు ప్రాంతాల నుండి వివిధ ఆసుపత్రుల్లో చేరారనీ తెలిపారు. ప్రాథమిక క్లినికల్ ఫలితాల ఆధారంగా, విషపూరిత పాల కారణంగా కిడ్నీ పనితీరు తగ్గినట్లు, సీరం క్రియేటినిన్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు సూచనలు చేయడం జరిగిందనీ తెలిపారు. ఎపిడెమియోలాజీ పరిశీలనలో పాల వినియోగం మరియు కేసుల మధ్య ప్రబలమైన సంబంధంగా ప్రాథమికంగా గుర్తించబడిందనీ, పరీక్షల వివరాలు వొచ్చిన తర్వాత వాస్తవ కారణాలు పై స్పష్టత వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. పాల సరఫరా నియంత్రణలో, Varalakshmi Milk Dairy, నరసాపురం గ్రామం, కోరుకోండ మండలం ద్వారా సరఫరా నిలిపివేయడం జరిగిందన్నారు. పాల కల్తీ కు సంబంధించి మొత్తం అడ్మిషన్లు 20 కాగా వారిలో 5 మరణాలు సంభవించాయనీ , 15 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పరిష్కార చర్యలుగా వేగవంతం చేయడం జరిగిందనీ, క్షేత్ర స్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామన్నారు. మరింత విస్తృత స్థాయిలో జిల్లా లో వనరుబుల్ ప్రాంతాలపై ప్రత్యేక విజిలెన్స్ కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 14 సర్వైవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు “ప్రజల ప్రాణాలను కాపాడడం, వెంటనే వైద్య చర్యలు చేపట్టడం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడం ప్రధాన లక్ష్యం”గా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని తెలియ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు, ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు. అత్యాధునిక వైద్య సేవలు అందించే క్రమంలో విజయవాడ రైన్ బో ఆసుపత్రి సహకారంతో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, బాధితుల నష్ట పరిహారం చెల్లించడం, మెరుగైన వైద్య సేవలను భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. కల్తీ పాలు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సదరు వెండర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు.వినియోగదారులు పాలు విషయంలో తేడా ఉన్న విషయం గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం వాస్తవ వివరాలు తెలుసుకునే దిశలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *