-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
– జిల్లా ఉపాధి అధికారి కే.హరీష్ చంద్ర ప్రసాద్
– జిల్లా నైపుణ్యాధికారి విడిజీ మురళి.
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు నందు గల శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ రాజేంద్ర ఎనర్జీ సొల్యూషన్ , టీమ్ లీజ్ మరియు ఇన్నోవా సోర్స్ తదితర కంపెనీలలో పోస్టుల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
10వ తరగతి , ఐ టీ ఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, అనుభవం ఉన్న లేదా ఉద్యోగం చేయడానికి ఆశక్తి గల 19 నుండి 30సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఈ జాబ్ మేళా లో ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమే, ఆధార్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సిద్ధంగా మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్, జిల్లా నైపుణ్యాదికారి వి డి జీ మురళి లు తెలిపారు.
Prajavartha Online Telugu News