విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్లమీద, డ్రైన్లలో వ్యర్ధాలు పడకుండా సమగ్ర పారిశుధ్య పనులు చేపట్టాలని, అలా వేసేవారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ కె.మయూర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, తడిపొడిగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్గించాలని, గత ఏడాది గుంటూరు నగరానికి దక్కిన స్వచ్చ లీగ్ సిటి కేటగిరిని నిలబెట్టుకొని, అందరీ భాగస్వామ్యం, కృషితో స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరుని అగ్రభాగంలో నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి డివిజన్ లో నూరు శాతం చెత్త సేకరణ జరిగితే వ్యర్ధాలు రోడ్ల మీద ఉండవన్నారు. కార్మికుల హాజరులో మెరుగుదల ఉండాలని, మధ్యాహ్నం సమయంలో హాజరు తక్కువగా ఉండడం గమనించామని, సిఎంఓహెచ్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్యాంగ్ వర్క్ పట్ల ఇన్స్పెక్టర్లు దృష్టి సారించాలన్నారు. పుష్ కాట్స్ మరమత్తులను ఎస్ఎస్ లు ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని, వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. చెట్ల కొమ్మల సమస్యల పరిష్కారానికి ట్రీ బ్రాంచ్స్ షడ్డర్ కొనుగోలుకి టెండర్స్ పిలవాలని ఈఈని ఆదేశించారు. నగరంలో ఇప్పటి వరకు ఉన్న 26 క్లస్టర్ కంపోస్ట్ యూనిట్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, ప్రతి డివిజన్ కి ఒక యూనిట్ ఏర్పాటు చేసి, ఇంచార్జి నియామకంకు చర్యలు తీసుకోవాలన్నారు. హోం కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని, ఆర్ఆర్ఆర్, ఎంఆర్ఎఫ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాల తొలగింపుపి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. మేజర్ డ్రైన్లలో ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడికక్కడ తొలగించడానికి వీలుగా గ్రిల్స్ ఏర్పాటు చేయడానికి గుర్తించాలన్నారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఈఈ విష్ణు, శానిటరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News