గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గానికి ఆదివారం జరగనున్న ఎన్నికల్లో 2,160 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సర్వం సిద్దం చేశామని ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్, అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. మార్చ్ 1న జరగనున్నఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గ ఎన్నికలకు విధులు కేటాయించబడిన అధికారులు సిబ్బంది, అభ్యర్ధులతో ఎన్నికల సరళి, నిబందనలపై ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, అవగాహన కల్గించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యులు ప్రకారం మార్చ్ 1న ఎన్నికలు నిర్వహించుటకు సర్వం సిద్దం చేశామని, ఈ ఎన్నికలకు విధులు కేటాయించబండిన అధికారులు సిబ్బందికి మరియు పోటీ చేస్తున్న అభ్యర్ధులతో ప్రత్యేక సమావేశాలు ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలను వివరించామన్నారు. ఈ ఎన్నికలు ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయని, అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించుట జరుగుతుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగా స్టేడియం సభ్యత్వ కార్డు లేక ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని, లేనిచో పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. ఎన్నికలలో సెక్రెటరీ పోస్టుకి ఇద్దరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి 11 మంది (పురుషులు), ముగ్గురు (మహిళలు) మొత్తం 16 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారన్నారు. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ (దామా మహేశ్వరరావు), జాయింట్ సెక్రెటరీకి (పాకనాటి ఉమామహేశ్వరరావు), ట్రెజరర్ కి (కండె కాంతారావు)ల నామినేషన్లు ఒక్కొక్కటి రాగా, ఆ పోస్ట్ లు ఎన్నిక లేకుండా ఏకగ్రీవమైనట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News