Breaking News

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిశుభ్రతను మెరుగుపరచడం మరియు రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యుఎం) ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడంలో క్షేత్రస్థాయి అధికారుల పాత్ర కీలకమని, ప్రతి డివిజన్‌లోనూ నూరు శాతం ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా చెత్త పేరుకుపోయే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండటానికి వీలులేదని, అటువంటి ప్రాంతాలను తక్షణమే గుర్తించి శుభ్రం చేయడమే కాకుండా, అక్కడ మొక్కలు నాటి ‘గ్రీన్ పాయింట్స్’గా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే, వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ సెంటర్లను తక్షణమే పూర్తిస్థాయిలో ఫంక్షనింగ్ లోకి తీసుకురావాలని ఆదేశించారు. పారిశుధ్య పనులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. చెత్త తరలించే ప్రతి వాహనం సరైన వర్కింగ్ కండిషన్‌లో ఉండాలని, ఎక్కడైనా వాహనాలకు లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఉపయోగించే పుష్ కార్ట్స్ రిపేర్లను ఎప్పటికప్పుడు చేపట్టి, పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. వీధి కుక్కలకు ఏబీసిని సోమవారం నుండి చేయాల్సిందేనన్నారు. ఏటుకూరు రోడ్ లోని జిఎంసి యార్డ్ లోని పెండింగ్ పనులను ఈ నెల 20 నాటికి పూర్తీ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డిఈఈకి స్పష్టం చేశారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఈఈ విష్ణు, డిఈఈ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *