Breaking News

నక్కపల్లిలో అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

-వేదిక, గ్యాలరీల్లో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు
-రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న అర్సెలార్ మిట్టల్ నిప్పన్
-రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిష్టాత్మక అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదికపై ఏర్పాట్లు,గ్యాలరీలో సదుపాయాలను పరిశీలించి పలు సూచనలుంచేశారు. పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లపై వివరించారు. శంకుస్థాపనకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భారీగా జన సమీకరణ జరిగే నేపథ్యంలో ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, సీఎం టూర్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమన్ పటేల్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *