విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఓబీసీమోర్చా ఆధ్వర్యంలో విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ నందు ఆదివారం “శాలివాహన చక్రవర్తి – ఆతుకూరి మొల్ల సాంస్కృతిక వైభవం” మహా సభ జరిగింది.
కుమ్మరి వృత్తి మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీక. ఆ సంప్రదాయం నుంచి వెలుగొందిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ “మొల్ల రామాయణం” ద్వారా తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేశారు. అలాగే శాలివాహన చక్రవర్తి ధైర్యసాహసాలకు ప్రతీకగా అలాగే శాలివాహన శకంతో చరిత్రలో నిలిచారు. మార్చి 13న మొల్లమాంబ జయంతి, మార్చి 22న శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని బిజెపి ఓబిసి మోర్చా నిర్వహించింది. భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కుమ్మరి–శాలివాహన ప్రజాపతులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ మాట్లాడుతూ.. తొలకరి జల్లు భూమి మీద పడితే అద్భుతమైన సువాసన వెదజళ్ళుతుందన్నారు. నేల తల్లి మొక్క కి మంచి వనరులు ఇచ్చి వృక్షాన్ని ఇస్తుందన్నారు. మట్టి కారణంగా పుట్టాము ఎదుగుతాము మళ్ళీ అంతర్థనం అవుతామన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమే మట్టి. మట్టిని నమ్ముకున్న కుమ్మరులందరు అలాంటి గొప్ప అంశం తో పుట్టారన్నారు. కుండని తయారు చేసి ఆహారపదార్దాలని ఉడికించి తినే ప్రక్రియ తో మంచి మేధస్సు ని తెచ్చుకోగలుతున్నామన్నారు. అలాంటి మట్టి పాత్ర లతో తయారుచేసేది గొప్ప వృత్తి. శాలివాహన శకం అనేది మనం చెప్పుకుంటామన్నారు. దండ యాత్రలకి వచ్చిన విదేశీయులని తరమికొట్టి శాలివాహన జాతి చరిత్ర లో లికించబడేలా చేసారన్నారు. శాలివాహన శకం కుమ్మరి నుంచి రాజు గా ఎదిగిన చరిత్ర ఉందన్నారు. శాలివాహన జయంతిని ఈ తరం రాబోయే తరం తో పాటు అందరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. అన్ని వైష్ణవి దేవాలయాలలో కుండలో తయారుచేసే వాటిని మాత్రమే నైవేద్యం పెట్టాలన్నారు. ఏ వృత్తి అయితే స్వామి వారికీ ఇష్టమో అలాంటి వృత్తి వృద్ధి చెందేలే కృషి చేద్దామన్నారు. అలాంటి కుమ్మరి వృత్తి ని అందరు గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కుమ్మరి సోదరి సోదరిమనులకి ధన్యవాదాలన్నారు.
సభకు ఓబిసి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రోంగల గోపి శ్రీనివాసరావు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, పేరేపి ఈశ్వరరావు శాలివాహన కుమ్మరి కార్పోరేషన్ చైర్మెన్,అడ్డూరి శ్రీరామ్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు,చెరుకూరి తిరుపతిరావు బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు,సెగ్గం శ్రీనివాసరావు బిజెపి ఒంగోలు జిల్లా అధ్యక్షులు,శశికుమార్ పల్నాడు జిల్లా అధ్యక్షులు మరియు కుమ్మరి శాలివాహన నాయకులు మడపాక శ్రీనివాసరావు,భాస్కర శ్రీనివాసరావు,గొల్లపల్లిలలిత్ ప్రజాపతి,నారెల్ల భసవేశ్వరరావు,పురుషోత్తం,ఐలాపురం రాజ,త్రిమూర్తులు, ఎంవీవీ ఎస్ ఎన్ మూర్తి, జి ఎన్ ఆర్ రాకేష్ బాబు,రాజకుమార్ వడియార్ మరియు బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, చారుగుడి శివలలిత,సుబ్రమణయ్య యాదవ్ ,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News