-మహిళా బిల్లు కోసం 1952 నుంచే సీపీఐ ఎంపీల పోరాటం
-మహిళా బిల్లు ముసుగులో మోదీ కీలక బిల్లుల ఆమోదానికి కుట్ర
-డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు..విస ్తతమైన చర్చ జరగాలి.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చూకూర్చేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని, ఆ దిశగా టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలతో వ్యతిరేకంగా ఓట్లు వేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మహిళా బిల్లును సీపీఐ స్వాగతిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో గురువారం ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళా బిల్లు ముసుగులో కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగా మహిళా బిల్లును పైకి చూపుతూ, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభఝనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు ఉన్నాయన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఎంపీల స్థానాలను తగ్గించే కుట్రకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఒక వైపు మహిళ ప్రస్తుతం 131వ రాజ్యాంగ సవరణ పేరిట మహిళా బిల్లును ప్రవేశపెడుతూనే, మరోవైపు మోదీ ప్రభుత్వం డీ లిమిటేషన్ పేరిట మరో బిల్లు తీసుకొస్తూ దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యను కదించి తన రాజకీయ మనుగడ సాధించేందుకు పార్లమెంట్ స్థానాలను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనుందన్నారు.
మహిళా సాధికారత కోసం సీపీఐ ఆది నుంచి పోరాడుతోందని ఈశ్వరయ్య వివరించారు. 1952 నుంచి 1966 వరకు పార్టీ ఎంపీగా ఉన్న రేణు చక్రవర్తి మహిళా హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సీపీఐ తరఫున ఎన్నో సార్లు ఎంపీగా ఎన్నికైన గీతా ముఖర్జీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తృత స్థాయిలో వివిధ పార్టీలను సమీకరించి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేశారన్నారుఆ సమయంలో ఈ బిల్లును అడ్డుకునేందుకు ఉమా భారతి వంటి బీజేపీ ఎంపీలు..వివిధ సాకులతో అడ్డంకులు స ష్టించి, ఆ బిల్లు ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లను ఆకర్షించాలనే రాజకీయ స్వార్థంతో మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందన్నారు.
జగనణన జరగకుండా, డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా, పార్లమెంట్‌లో తమకు బలం ఉందన్న సాకుతో డీ లిమిటేషన్ బిల్లును ఆమోదిస్తున్నారని చెప్పారు. 2024, 2029 కాకుండా 2034కు వాయిదా వేయడం వెనుక జనగణన, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలను కారణంగా చూశారని తెలిపారు.
1970లో జనాభా నియంత్రణ చర్యలను దక్షిణాదిలోని తమిళనాడు వంటి రాష్ట్రాలు.సమర్థవంతంగా అమలు చేశాయన్నారు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించకపోవడంతో అక్కడ జనాభా పెరిగిపోయిందని, ఫలితంగా అక్కడ ఎంపీ సీట్లు పెరగనున్నయని వివరించారు.
దీనిని కేవలం రాజకీయ అంశం కాకుండా విధానపరమైన సమస్యగా, దక్షిణ భారత దేశం చూడాల్సిన అవసరం ఉందన్నారు.
దక్షిణ భారత దేశంపై బీజేపీ ప్రభావం తక్కువుగా ఉన్నందున, ఉత్తర భారత దేశంపై రాజకీయ ఆదిపత్యం కోసమే ఈ ప్రయత్నాలకు ఒడిగట్టిందన్నారు.
ఇప్పుడు అదే కారణంగా ఆయా రాష్ట్రాల ప్రాతినిధిత్వం తగ్గించే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీల స్థానాలు తగ్గిపోతాయన్నారు.
గతంలో ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్ ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, అది శాస్త్రీయ బద్దంగా లేకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు గుర్తుచేశారు. భవిష్యత్‌లో అధ్యక్ష పాలన తీసుకొచ్చేందుకుగాను బీజేపీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందన్నారు.
డీ లిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు తన లేఖలో స్పష్టత ఇవ్వలేదని, అలాగే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో టీడీపీ, జనసేన, వైసీపీ ఓటు వేయాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. కరోనా రీత్యా 2020-21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడినా, ప్రపంచంలోని అనేక దేశాలు తమ జనగణన పూర్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో బిల్లు ఆమోదించినప్పటికీ, 2025 నాటికి కూడా అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయకుండా, ఇప్పుడు డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం ప్రశ్నార్థకమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్ విధానాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని, ప్రధానంగా పార్లమెంట్‌లో డీ లిమిటేషన్ బిల్లును టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి, కె. రామాంజనేయులు, దోనేపూడి శంకర్, అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్, ఎస్. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News