Breaking News

ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం గరిష్ఠంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1డిగ్రీలు నమోదైందని తెలిపారు. 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం (17-04-26) మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43-44.5°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. 30 మండలాల్లో తీవ్రవడగాలులు, 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం జిల్లా : బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాలు;

విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు ;

పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు;

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ;

పోలవరం జిల్లా: చింతూరు మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం 10, మన్యం 1, పోలవరం 10, అనకాపల్లి 2, కాకినాడ 4, తూర్పుగోదావరి 10, ఏలూరు 4, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, మార్కాపురం 3, నంద్యాల4, శ్రీసత్యసాయి 1 మండలాల్లో (55) వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. శనివారం 03 తీవ్ర, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వడగాల్పులు వీచే మండలాలు, ఉష్ణోగ్రతల పూర్తి వివరాలు క్రింది లింక్లో :
https://apsdma.ap.gov.in/files/1d3ab8dcce5f538bd3ee8a232af82c9a.pdf

గురువారం నంద్యాల(జి) సంజామలలో 45. 1°C, కడప (జి) ఒంటిమిట్టలో 44.9°C, మార్కాపురం(జి) అనుమలపల్లిలో 44.2°C, శ్రీసత్యసాయి(జి) ముడిగుబ్బలో 43.5°C, అనంతపురం(జి) తెరన్నపల్లి, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 43.4°C, కర్నూలు(జి) బస్తిపాడు 43.2°C, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.1°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42°C డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *