Breaking News

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (21-04-26) 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(46)

శ్రీకాకుళం జిల్లా :
ఆమదాలవలస,బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు

విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస,
సంతకవిటి, శృంగవరపుకోట, తెర్లాం, వంగర, వేపాడ, విజయనగరం మండలాలు ;

పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా : అనంతగిరి మండలం

అనకాపల్లి జిల్లా:
దేవరాపల్లి మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

శ్రీకాకుళం 6 , విజయనగరం 3, మన్యం 2, అల్లూరి 1, పోలవరం 4, విశాఖ 1, అనకాపల్లి 7, కాకినాడ 2,
తూర్పుగోదావరి 2, ఏలూరు 1 మండలాల్లో(29) వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.

సోమవారం మన్యం(జి) మక్కువలో 44.2°C, కర్నూలు(జి) చిప్పగిరిలో 43.9°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డ, నెల్లూరు(జి) గూడూరులో 43.6°C, తిరుపతి(జి) వరదయ్యపాలెం 43.4°C, మార్కాపురం(జి) కంభం, కడపలో 43.3°C, అనకాపల్లి(జి) దేవరాపల్లిలో 43.2°C, కాకినాడ(జి) కరప, పల్నాడు(జి) గురజాలలో 42.7డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,కర్నూలు, నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *