-మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను కట్టడిచేద్దాం…
-ప్రజల భాగస్వామంతోనే మలేరియా నివారణకు చర్యలు…
-జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రరణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మలేరియా అవగాహన ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు.
అనందరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధికి కారణమైన దోమలను పూర్తిగా నియంత్రించేందుకు ప్పు్రల భాగస్వామ్యం అవసరమన్నారు. దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు విసృత ప్రచారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, మలేరియా వ్యాధి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని దోమలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోనేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువైన దోమల ద్వారా మలేరియా ఫైలేరియా డెంగీ, చికున్ గున్యా, మెదడు వాపు, వంటి వ్యాధులు వ్యాప్తిస్థాయన్నారు. నివాస పరిసరాల ప్రాంతాలలో సాధారణంగా ఆనాఫిలస్, క్యూలెక్స్, ఏడిస్, మాన్సోనియా, ఆర్మిజరిస్ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. మలేరియా వ్యాధిని వ్యాప్తిచేసే ఆడ దోమ ఉదయం, సాయంత్ర వేళల్లో చెమట పట్టే శరీర భాగాలపై కుట్టి రక్తాన్ని పీల్చుకొని నిల్వ ఉన్న నీటి పై గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేసుకొంటాయన్నారు. ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో కిటికీలను మూసి ఉంచుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలనన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో, ఆరుబయట నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టేలా చూసుకోవాలన్నారు. చలి వణుకుతో కూడిన జ్వరం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి రక్త పరీక్షలు ద్వారా వ్యాధిని నిర్థరణ చేసి తక్షణమే వైద్య సహాయం అందించేలా వైద్యాధికారులు సిబ్బంది కృషి చేయాలన్నారు. నగరంలో కాలువలు డ్రైన్‌లలో మురుగునీరు నిల్వ ఉండకుండా నగర పాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు కాలువులను శుభ్రపరచి మురుగు నీటి నిల్వలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. అధికారులు ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు బాగస్వామ్యంతో నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్ధి మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పూల కుండీలు, ఖాళీడబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ సీసాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహాసిని, డిప్యూటి డిఎంఅండ్ హెచ్‌వో డా.జె. ఇందుమతి దేవి, డిఐవో డా. శరత్‌బాబు,ఆర్‌బిఎస్‌కె. డా. మాధవి, నోడల్ ఆఫీసర్ డా. శ్రావాణి, బయోలజిస్ట్ కామేశ్వరరావు, ఎపిడమలజిస్ట్ డా. సునీల్ కుమార్, యÖపిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News