Breaking News

రాష్ట్రంలో 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం (26-04-26) వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రేపు వడగాల్పులు వీచే మండలాలు(23)

విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాలు;

పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలు;

అల్లూరి జిల్లా: జికే వీధి మండలం

పోలవరం జిల్లా: చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో(23) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

శనివారం కర్నూలు(జి) నగరడోనలో 44.8°C, కడపలో 44.2°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, మార్కాపురం(జి) కంభం, శ్రీసత్యసాయి(జి) తలుపలలో 43°C, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.6°C, తిరుపతి(జి) బేస్తపల్లిలో 42.5°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, పోలవరం(జి) ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని తెలిపారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *