అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచన మేరకు ఏపీ సచివాలయంలోని డిస్పెన్సరీలో డాక్టర్లు, సిబ్బంది మాక్ డ్రిల్ ను గురువారం నాడు నిర్వహించారు. ఏవైనా ఆయిల్స్, కెమికల్స్, యాసిడ్స్ శరీరంపై పడినప్పుడు కాలిన గాయాలతో వచ్చిన వారికి అత్యవసరంగా ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై మాక్ డ్రిల్ లో చూపించారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించామని, అంబులెన్స్‌లో కాలిన గాయాలతో వచ్చిన వారికి వెనువెంటనే ఎలాంటి చికిత్స అందిస్తారన్నదానిపై ఇక్కడ చూపించామని డాక్టర్ హదస్సా తెలిపారు. ప్రమాద పరిస్థితిని నుండి పేషెంట్ ప్రాథమికంగా కోలుకున్న తర్వాత జిల్లా ఆసుపత్రులకు పంపించే క్రమంలో ప్రతి దశలోనూ ఎలాంటి చికిత్స అందించాలన్నదానిపై డాక్టర్లు, సిబ్బందికి అవగాహన కల్పించామని ఆమె చెప్పారు. డాక్టర్ జి.దివ్యసాయిశ్రీ, డాక్టర్ చింతి ఆనంద్, డాక్టర్ వి.ప్రశాంత్ కుమార్ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు
Prajavartha Online Telugu News