Breaking News

ఎమ్మెల్యే సుజనా కార్యాలయంలో ఎల్వోసీ ల అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని 55 వ డివిజన్ కు చెందిన ఆశ్రాపున్నీస గర్భ సంచి సమస్యతో బాధ పడుతుండడంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని, 1,80,000/- ఖర్చు అవుతుందని తెలిపారు. అదే విధంగా భవానీపురం కి చెందిన బచ్చు శివకుమారి గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండటం తో బై పాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.. వీరీరువురూ సమస్య ను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. వాటికి సంబంధించిన ఎల్వోసీ లను సోమవారం బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ , 42వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, 39 వ డివిజన్ బిజెపి మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బిజెపి నాయకులు బుల్లా విజయ్ , 52వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ఈగల సాంబ శివరావు, సుజనా మిత్ర లు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *