జిల్లాను అగ్రగామిగా నిలపాలి…

-వినూత్న కార్యక్రమాలను ఆలోచించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలను రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్, ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అందిన అర్జీలు శత శాతం పరిష్కారం,  కేటాయించిన బడ్జెట్  మురిగిపోకుండా చూడాలని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను వివరించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను అనుసంధానం చేసి  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత సమయానికి నివేదికలు అందేలా చూడాలన్నారు.  జిల్లాలో వినూత్నంగా చేపట్టకు అవకాశం ఉన్న కార్యక్రమాలను గూర్చి ఆలోచించాలని, సంబంధిత ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తేనె,  అగరబత్తి, మిల్లెట్స్ ,హ్యాండ్లూమ్స్, ఇ – కామర్స్ ప్లాట్ఫారంలపై ఎలా బిజినెస్ చేయవచ్చు ఆలోచించాలన్నారు. అంగన్వాడీ సెంటర్లకు డ్రింకింగ్ వాటర్ ను, టాయిలెట్లను 15 రోజులలో ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. స్కూల్లో డ్రాప్ అవుట్ లు లేకుండా చూడాలని, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికారులు తమ కార్యాలయంలోని కోర్టు కేసులకు బాధ్యత గల అధికారిని నియమించాలని, నిర్ణీత సమయంలో కౌంటర్ ఫైల్ చేసేలా చూడాలన్నారు. ఎల్ నినో ప్రభావం వలన ఈ సంవత్సరము వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు వర్షపాతం తక్కువగా ఉంటే ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలన్నారు.  ఇప్పటి నుండే నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. పని చేయటమే కాదు .. చేసిన పనులను ప్రజలకు తెలియ చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవెన్యూ డివిజన్ అధికారి కే శ్రీనివాసరావు ,డిప్యూటీ కలెక్టర్లు, గంగరాజు, తెనాలి ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *