-సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉండటమే మా కుటుంబ లక్ష్యం – బొండా రవితేజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ఈరోజు ఆదివారం రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బొండా రవితేజ & బొండా సిద్దార్ధ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన బొండా రవితేజ జన్మదిన గీతం”ను విడుదల చేయగా, ఆ పాట కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది, అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అభిమానుల సందడి మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు బొండా సిద్దార్ధ, బొండా రవితేజ, బొండా సుజాత పాల్గొని అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానాన్ని పాట రూపంలో వ్యక్తీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం తనపై ప్రజలకు, కార్యకర్తలకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ గీతాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరికీ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తమ కుటుంబంలో జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. పేదలు, వృద్ధులు, మహిళలు మరియు అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం తమ కుటుంబం ఎప్పటి నుంచో పాటిస్తున్న సంప్రదాయమని తెలిపారు. అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, అవసరమైన వారికి ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవాలని తమ నాయకుడు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎప్పుడూ సూచిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P-4 పథకానికి అనుగుణంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల బాధ్యతలు తీసుకుని ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు సింగ్‌నగర్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు మరియు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బొండా రవితేజ హామీ ఇచ్చారు.
చివరగా తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News