స్టార్టప్‌లు పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలి

-అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
-యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
-డిజిటల్ మార్కెటింగ్‌కు చేరువ కావాలి
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు స్టార్టప్‌ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగగలవని అన్నారు.
శనివారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో అర్బన్ జిల్లా సమాఖ్య, ఫౌండర్స్ రూఫ్, వివిధ స్టార్టప్ ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, స్మార్ట్ వెహికల్ మేనేజ్మెంట్, ప్రోటీన్ ఇన్ఫ్యూజ్డ్ కాఫీ, డిహైడ్రేషన్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ.. ఇలా వివిధ భాగాల్లో స్టార్టప్ లు ప్రారంభించిన యువతతో సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మార్కెటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, ఆర్థిక సహాయం, ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి, ఎస్ హెచ్ జి పారిశ్రామికవేత్తలు వాణి, మాధురి, కృష్ణవేణి, ఫౌండర్స్ రూఫ్ సారధులు విష్ణు, జగదీష్, వివిధ స్టార్టప్ ల స్థాపకులు ఉజ్వల్ బొర్రా, విఠల్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *