Breaking News

ఇం”ధన” దరల నియంత్రలో మోడీ వైఫల్యం !

-ఇరాన్ యుద్దానికి సాకుగా చూపి ప్రజలపై ధరలతో దాడులు!! …జి.కోటేశ్వరరావు ఆగ్రహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
5 రాష్ట్రల ఎన్నిలకలు అవ్వడమే తడవుగా నరేద్ర మోడీ నేతృత్వలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇరాన్ యుద్దాన్ని సాకుగా చూపి ప్రజలపై ధరలతో దాడులు చేస్తూ బడుగు జీవుల జీవన చక్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్తుదని సిపిఐ నగర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి, వాణిజ్య వంట గ్యాస్ ధరలపై నేడు అయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంధన దరల నియంత్రలో పూర్తిగా వైఫల్యం చెంది అది కప్పి పుచ్చుకునేందుకు యుద్దని సాకుగా చూపుతుందని, ఎన్నికలు ముగిసే వరకు యుద్ధ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కూడా మన స్వయం ప్రకటిత విశ్వ గురువు నరేంద్ర మోడీ మాట్లాడుతూ మన దేశంపై యుద్ధ ప్రభావం లేదు ఇంధన లభ్యతపై ఎటువంటి సందేహం వద్దు మనకు పూర్తి స్థాయిలో ఇంధన లభ్యత ఉంది అని నమ్మ బలికి ఎన్నికలలో లబ్దిపొంది నేడు యుద్ధ సంక్షోభం ముంచుకు వస్తుంది అంటూ చమురు సంస్థలకు లాభాలు చేకూర్చే విధముగా అడ్డగోలుగా ఇంధన ధరలను పెంచుతూ ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారని అయన దుయ్యబట్టారు.
చమురు సంక్షోభంపై అమెరికా కు దాసోహం అంటూ ప్రత్యామ్న్యాయ మార్గాలైన రష్యా నుండి ఇంధన కొనుగోలు నిర్వహించకుండా ప్రత్యక్షంగా, పరోక్షముగా ప్రజా జీవితాలను ప్రభావితం చేస్తూన్నారు. ఇంధన దరల పెరుగుదల ప్రభావం అన్నది కేవలం వాహనలేక పరిమితమైన అంశం కాదు ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ప్రజలు తినే తిండి, కట్టుకునే బట్ట ఒకటేమిటి ప్రతి మనిషి దైనందిక జీవితంలో అవరమైన ప్రతి అంశంపై ముడి పది ఉంటుందని తెలియయజేసారు.
పెంచిన ఇంధన దార్లను వెంటనే తగ్గించక పోతే ప్రజలు వారి జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ వారి ఆర్థిక స్థితిగతనులను తారుమరు చేసే ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన హెచ్చరించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధరలను వెంటనే వెన్నక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *