విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల కోసం ప్రముఖ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా సంస్థ కొత్త ఫ్రెంచ్ డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఏలూరురోడ్డులోని సోనోవిజన్ హెడ్ షోరూంలో ఎండీ పొట్లూరి భాస్కరమూర్తి శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడుతూ, 33 అంగుళాల (83.82 సెం.మీ) వెడల్పుతో ఆటో ఐస్ మేకర్‌లో వచ్చిన భారతదేశ మొట్టమొదటి ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజరేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. దీనికి ప్లంబింగ్ కనెక్షన్ అవ సరం లేకుండానే కోరుకున్నపుడు ఐస్ పొందే వీలుంటుందన్నారు. 574 లీటర్ల నుంచి 610 లీటర్ల వరకు వివిధ సామర్థ్యాýలో లభించే ఈ రిఫ్రిజిరేటర్లలో ఆహార తాజాదనం, పరిశుభ్రత కోసం అధునాతన ఫీచర్లు వున్నాయన్నారు. వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా కూలింగ్‌ను మార్చుకునే స్మార్ట్ లెర్నర్, వేగవంతమైన కూలింగ్ కోసం ఎక్స్‌ప్రెస్ ఫ్రీజ్, స్మార్ట్ మానిటరింగ్ కోసం ఏఐ థిన్‌క్యూ, వైఫై కనెక్టివిటివంటి సదుపాయాలున్నాయన్నారు. ఫ్రెంచ్ డోర్ ధరలు డిస్కౌంట్లో రూ.90 వేల నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఎల్‌జి కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ కేవీ కృష్ణాజీ మాట్లాడుతూ… ‘మేక్ ఇన్ ఇండియా’ సైడ్ బై సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్ ఫోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇవి 790 లీటర్ల వరకు సామర్థ్యం కలిగి, బ్లాక్ మిర్రర్ గ్లాస్, షైనీ స్టీల్, నేచురల్ బీజ్ వంటి ఆకర్షణీయమైన ఫినిషింగ్‌లలో అందుబాటులో వుంటాయన్నారు. వీటితోపాటు 674 లీటర్ల సామర్థ్యంగల అతిపెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కూడా ఎల్‌జి సంస్థ లాంచ్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌జి సంస్థ ప్రతినిధులు పి.కిశోర్‌బాబు, పి.మనోజ్, నారం నాయుడు, సోనోవిజన్ షోరూమ్ మేనేజర్ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News