Breaking News

సీఎం ముఖ్య అతిథిగా 25న ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్‌

– స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌
– విజ‌య‌వాడ‌ అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో కార్య‌క్ర‌మం
– ఏర్పాట్లు ప‌గ‌డ్బందీగా చేయాల‌ని అధికారుల‌కు సూచ‌న‌లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌తి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త‌ను త‌యారు చేయాల‌న్న గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడి గారి ల‌క్ష్యం మేర‌కు ఎంఎస్ఎంఈ ప‌ని చేస్తుంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ‌వారం గౌర‌వ ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న‌ విజ‌య‌వాడ డాక్ట‌ర్ బీఆర్‌. అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో జ‌రిగే ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను శ‌నివారం మంత్రి ప‌లు శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌వేక్షించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న గ్రోత్ స‌మ్మిట్‌ను అన్నిశాఖ‌ల అధికారులు విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి సూచించారు. ఎంఎస్ఎంఈ ఔత్సాహికుల‌ను ఈ కార్య‌క్ర‌మంలో ఎలా స‌మీకృతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాల‌నే అంశంపై మంత్రి చ‌ర్చించారు. గ్రోత్ స‌మ్మిట్ విష‌యంలో తీసుకోవాల్సిన ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను మంత్రి అధికారుల‌కు సూచించారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, సీఎం షెడ్యూల్ గురించి సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ యువ‌రాజ్‌, వీసీ & ఎండీ ఏపీఐఐసీ దినేష్‌కుమార్‌, ఏపీ ఎంస్ఎంఈ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ సీఈవో విశ్వ‌, విజ‌య‌వాడ ఆర్డీవో, ఐ & పీఆర్ శాఖ‌, పోలీస్ శాఖ నుంచి ఏడీసీపీ ముర‌ళీకృష్ణ‌, డీఎస్పీ మాన‌స‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *