Breaking News

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) – 2027 కోసం నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) – 2027 కోసం నామినేషన్లు ఆహ్వానించబడ్డాయని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని షేక్ రుక్సానా సుల్తానా బేగం ప్రకటన లో తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడం కోసం కేంద్ర మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని అందజేస్తోంది.
పురస్కారం రంగాలు: 1. ధైర్యం (Bravery), 2.సామాజిక సేవ (Social Service), 3.పర్యావరణం (Environment),
4.క్రీడలు (Sports),5. కళలు & సంస్కృతి (Art & Culture), 6.విజ్ఞానం & సాంకేతికత
(Science & Technology)
అర్హత: 31.07.2026 నాటికి 5 సంవత్సరాలు పైబడి, 18 సంవత్సరాలు మించని బాలలు, భారతీయ పౌరులు
మరియు భారతదేశంలో నివసిస్తున్న వారు. స్వయం నామినేషన్ (Self-nomination) మరియు
సిఫార్సులు( ఉత్తమ ప్రతిభ కలిగిన బాలలను ఏవైనా సిఫార్సు చేయవచ్చు) ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం: నామినేషన్లు https://award.gov.in ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. చివరి తేదీ: 31-07-2026
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ/వార్డు స్థాయి సంఘాలు, ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం గురించి విస్తృత ప్రచారం చేసి, అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వారి తరపున అన్ని సంబంధిత శాఖలను కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *