విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ఓటరు జాబితా పరిశీలన, బూత్ స్థాయి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ గారు మాట్లాడుతూ.. Sir ప్రక్రియ లో భాగంగా ప్రతి ఓటరు వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పార్టీ శ్రేణులు ప్రజా సమస్యల రూపంలో బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో BLAల పాత్ర అత్యంత కీలకమని, ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని, ప్రతి డివిజన్లో పార్టీ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని దేవినేని అవినాష్ గారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, పార్లమెంట్ పరిశీలకులు తంగిరాల రామిరెడ్డి, ఆళ్ల చెల్లారవు,జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య,జిల్లా టీచర్స్ విభాగ అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి,నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షుడు మాగంటి నవీన్,మండల అధ్యక్షులు గద్దె కళ్యాణ్,చలపాటి సన్నీ,దొడ్డా సాయి కృష్ణ, పంతాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News