Breaking News

విద్యతోనే అత్యుత్తమ స్థానాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-పేదల విద్యకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయం
-కూటమి రాకతో ప్రభుత్వ విద్యకు మహర్దశ
-ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
-సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి
-ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా పేదల విద్యకు అండగా ఉంటున్నా : మంత్రి సవిత
-104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు
-కురమ సంఘ సౌజన్యంతో పురస్కారాలు అందజేసిన మంత్రి సవిత
-సొంత నిధులతో విద్యార్థులకు మంత్రి సవిత ప్రోత్సాహకాలు
-నలుగురికి రూ.25 వేల చొప్పున రూ.లక్ష…
-200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేసిన మంత్రి సవిత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాలే దీనికి నిదర్శమని అన్నారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. గుంటూరు నగరంలోని దేవరసాయి కృష్ణ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గీయ విద్యార్థులకు ఉమ్మడి గుంటూరు కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్త కనకదాస పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారాలు మంత్రి సవిత శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. విద్యలో రాణిస్తున్న పేద విద్యార్థులకు ఈ సత్కరాలు మరింత ప్రోత్సాహమిస్తాయన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థను రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అత్యున్నత స్థానాలకు తీసుకెళుతున్నారన్నారు. గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను ఆయన గాడిన పెడుతున్నారన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు వందరోజుల ప్రణాళికలు అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో ఆయన కృషి మెచ్చుకోదగినదన్నారు. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయన్నారు. బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కేవలం విద్యతోనే సరిపెట్టకుండా, క్రీడల్లోనూ ప్రోత్సహించేలా బీసీ గురుకులాల్లో స్పోర్ట్స్ కిట్లు అందజేయబోతున్నామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల మనోభావాలకు గౌరవిమిస్తూ, ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలన్నారు.

104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేవారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు.

బ్యాగ్ లు, నగదు అందజేసిన మంత్రి సవిత

అత్యుమ్మ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంతంగా రూ.లక్ష నగదు, 200 స్కూల్ బ్యాగ్ లను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ లో, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.లక్ష లను మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు. తన తండ్రి. మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డికి విద్య పట్ల మక్కువ ఎక్కువని మంత్రి సవిత తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. ఈ ఏడాది టెన్త్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 550 పైబడి మార్కులు సాధించిన 24 మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయమందించామన్నారు. ఇంటర్ సెకండియర్ లో 950 పైబడి మార్కులు సాధించిన 70 మందికి రూ.50 వేల చొప్పున అందించామన్నారు. బీటెక్ విద్యార్థులకు లాప్ ట్యాప్ లు అందజేస్తున్నామన్నారు.

అంతకుముందు విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు అందజేయడానికి వచ్చిన మంత్రి సవితకు కురమ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సవిత స్థానిక విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ప్రతినిధులు మర్రి వెంకట సత్యనారాయణ, తట్టి అర్జున రావు, ఎం.సత్యనారాయణ, బక్కా రామకృష్ణ, కార్పొరేటర్ ఎస్.శ్రీనివాసరావు, మర్రిపాటి రమేశ్, లంబు నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, దన్నే అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *