Breaking News

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.  బుధవారం ఉదయం విఎంసి ప్రధానకార్యలం ముందు ఉన్న నర్సరీ వద్ద ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ మరియు మొక్కల నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి కందుల శారదా వాణి ప్రసాద్, సభ్యులు వంశీ, తోట ఆదిత్య విజయ్ రాజ్, షేక్ భాషా, వల్లభనేని వాణి, షేక్ చాంద్, పద్మజ, షా న్యూస్ ప్రతినిధి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *