Breaking News

భగవాన్ బిర్సా ముండా భారతదేశ గర్వకారణం

-Dr. L మురుగన్
-సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి, ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం ఆజాదికా అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటున్న సందర్భం ఇది. బ్రిటీష్ ప్రభుత్వం ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా మాతృభూమి స్వాతంత్ర్యం కోసం నిర్భయంగా పనిచేసిన నాయకుల్లో ధృవతార గా నిలిచే పేరు భగవాన్ బిర్సా ముండా. బిర్సా ముండా జీవించింది ఇరవై ఐదు సంవత్సరాలే ఐనా, సాహసమయ జీవితాన్ని గడిపాడు, అతని వీరోచిత చర్యలు, చేసిన గొప్ప పనులు భగవాన్‌ను అనేకులు అనుసరించేలా చేసింది. అతని జీవితమంతా సాహసంతో పోరాడిన సందర్భాలే నిండి ఉన్నాయి., బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండకు, అన్యాయాలకి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రయత్నాలే అన్నీ.

ప్రస్తుత జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15న గిరిజన ముండా కుటుంబంలో జన్మించిన బిర్సా బాల్యమంతా కడు పేదరికంలో గడిచింది. బ్రిటీష్ ప్రభుత్వం దోపిడీయే పరమావధిగా మధ్య, తూర్పు భారతదేశంలోని లోతైన అరణ్యాలలోకి చొచ్చుకుపోయి, ప్రకృతిఒడిలో ప్రశాంతంగా నివసిస్తున్న గిరిజనుల జీవన విధానానికి అవరోధాలు కలిగించడం మొదలైన సమయం అది.

ఇంగ్లీషు వారు ఛోటా నాగ్‌పూర్ ప్రాంతంలో ఫ్యూడల్ జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టారు, గిరిజన ‘ఖుంట్‌కట్టి’ వ్యవసాయ వ్యవస్థను నాశనం చేశారు. బ్రిటిష్ పరిపాలనలో అక్కడకు వేరేప్రదేశాల నుంచి నుంచి వడ్డీ వ్యాపారులను కాంట్రాక్టర్లను , అలాగే భూస్వాములను తీసుకువచ్చారు, ఇది గిరిజనులను దోచుకోడానికి బ్రిటిష్ వారికి తోడ్పడింది.

అలుపెరగని మిషనరీ కార్యకలాపాలు, బ్రిటిష్ ప్రభుత్వ మద్దతుతో కొనసాగాయి, అటవీ నివాసులైన ఆదివాసీల మత-సాంస్కృతిక తత్వాన్ని అవమానించడం, వారి జీవన విధానంలో జోక్యం చేసుకోవడం వంటి జరుగుతున్నఅన్యాయాల్ని యువ బిర్సా తన కళ్ల ముందు చూస్తూ పెరిగాడు వలస పాలకులు, డికులు (బయటి వ్యక్తులు – ఆదివాసీల విరోధులు) స్థానిక ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా పని చేస్తున్నారో అర్థం చేసుకున్నాడు. ఈ దివాళాకోరు జట్టుకి వ్యతిరేకంగా పోరాడాలనే అతని సంకల్పాన్ని దృఢపరచడానికి ఇది ఇంధనంగా పనిచేసింది.

యువ బిర్సా 1880వ దశకంలో గిరిజన హక్కులను పునరుద్ధరించాలని అహింసా మార్గంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సర్దారీ లరాయ్ ఉద్యమాన్ని నిశితంగా గమనించాడు. అయితే అణచివేతకే మోగ్గుచూపిన వలస పాలన ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. జమీందారీ వ్యవస్థ ఆదివాసీలను భూ యజమానుల స్థితి నుండి కూలీల స్థాయికి దించింది. భూస్వామ్య వ్యవస్థ అటవీ ప్రాంతాల్లో బలవంతంగా ఇష్టానికి వ్యతిరేకంగా ఆదివాసీలతో పని చేయించడాన్ని (వెట్టిచాకిరీ ) తీవ్రతరం చేసింది. పేద, అమాయక గిరిజనుల దోపిడీ తీవ్రస్థాయికి చేరుకుంది.

ఈ పరిస్థితి బిర్సాను ఆదివాసీల పక్షాన పోరాడడానికి ఉసిగొల్పింది. బిర్సా తోటి గిరిజనులకు మతపరమైన విషయాలలో కొత్తదారి చూపించాడు. గిరిజనుల జీవితాన్ని, సంస్కృతిని కించపరిచే మిషనరీలకు ఎదురునిలచాడు. అదే సమయంలో బిర్సా మతాచారాలను మెరుగుపరచడం, సంస్కరించడం కోసం అవిరళ కృషి చేశాడు, అనేక మూఢ ఆచారాలను కాలదన్నాడు. కొత్త సిద్ధాంతాలను, కొత్త ప్రార్థనలను తీసుకువచ్చాడు, అనేక అలవాట్లను సంస్కరించాడు. గిరిజనుల ఆత్మాభిమానాన్ని తట్టిలేపి ఆదివాసీ వ్యవస్థను పునరుద్ధరించడానికి, పునర్నిర్మించడానికి కృషి చేశాడు. బిర్సా ఆదివాసీల ఆత్మాభిమానాన్ని తట్టిలేపెందుకు “సిర్మరేఫిరున్ రాజా జై” లేదా ‘పూర్వీకుల రాజుకు విజయం’ గురించి వివరించి ఆకట్టుకున్నాడు, అంటే ఆదివాసీల భూమి తమ పూర్వీకుల స్వయంప్రతిపత్తి నియంత్రణలో ఉంటుందని, అందువల్ల వారికి తమ భూమిపై సార్వభౌమాధికారం ఉంది అని చెప్పాడు. తద్వారా బిర్సా ప్రజా నాయకుడు అయ్యాడు. అనుచరులు అతనిని భగవాన్ గా, ధరతి ఆబా గా పరిగణించబడటం ప్రారంభించారు.

బిర్సా స్వార్థ ప్రయోజనాల దోపిడీ వ్యవస్థ గురించి, దాని దౌర్జన్య స్వభావం గురించి గిరిజనులకు అవగాహన కల్పించాడు. దోపిడీ దారులైన డికులతో పాటు, అణచివేత బ్రిటిష్ ప్రభుత్వం తమ అసలు శత్రువులని అతనికి అవగాహనకలిగింది. బ్రిటీష్ పాలకుల వల్లే అన్ని సమస్యలు. అవే తమ అణచివేతకు మూలకారణమని బిర్సా ముండా స్పష్టంగా గుర్తించాడు. అతనికి చాలా స్పష్టంగా ఉన్న అవగాహన “అబువా రాజ్ సేతర్జన, మహారాణి రాజ్ తుండుజన (అర్థం: రాణి రాజ్యం అంతమై, మన రాజ్యం స్థాపన కావాలి) భగవాన్ బిర్సా ప్రజల మనస్సులలో ఇదే ఉద్దేశపు నిప్పురాజేసాడు. బిర్సా నాయకత్వంలో ముండాలు, ఒరాన్లు, ఇతర ఆదివాసీలు, ఆదివాసీయేతరులు అతని పిలుపుకు ప్రతిస్పందించారు . వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ , సాంస్కృతిక విముక్తి కోసం వలసవాద యజమానులు మరియు దోపిడీ దిక్కులకు వ్యతిరేకంగా ‘ఉల్గులన్’లో చేరారు, తిరుగుబాటు చేశారు.ప్రజల్ని సుంకాన్ని, పన్నులను చెల్లించవద్దన్నాడు, భూస్వామ్య, మిషనరీ, బ్రిటిష్ వలస ప్రభుత్వ అధికార కేంద్రాలపై అవుట్‌పోస్టులపై దాడి చేశాడు. సాంప్రదాయ విల్లులు మరియు బాణాలతో మధ్య-తూర్పు భారతదేశంలోని గిరిజనులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సమర్ధంగా నిర్వహించాడు.

అయితే ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిజమైన దోపిడీదారులపై మాత్రమే దాడులు జరిగేట్టు, బిర్సా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనతికాలంలోనే ప్రజలు బిర్సాను తమ దైవ శక్తి స్వరూపంగా భావించారు. కొద్దికాలంలోనే పోలీసులకు చిక్కి జైలులోనే 9 జూన్ 1900న బందీగా మరణించాడు. భగవాన్ బిర్సా ముండా పోరాటం వృధా కాలేదు. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని గిరిజనుల దుస్థితి, వారిపై తమద్వారా జరుగుతున్న దోపిడీని మాపే దిశలో మార్పుకు బాటలు వేసింది. ఆదివాసీల రక్షణ కోసం ‘ఛోటా నాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్ 1908’ని తీసుకువచ్చింది. ఇది గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని పరిమితం చేసిన ముఖ్యమైన చట్టం. దీనివల్ల గిరిజనులకు గొప్ప ఉపశమనం కలిగింది. ఇది గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఒక మైలురాయి చట్టంగా మారింది. బ్రిటీష్ పాలకులు కూడా వెట్టిచాకిరి లేదా నిర్బంధ పనిని రద్దు చేయడానికి చర్యలు తీసుకున్నారు.

ముండా మరణించిన 121 సంవత్సరాలైనా ఇప్పటికీ కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. అతడు పరాక్రమానికి, ధైర్యం, సాహసం, నాయకత్వానికి చిహ్నం. తన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూనే అవసరమైన చోట తన మత విశ్వాసాల్ని, నమ్మకాల్ని సంస్కరించడానికి వెనుకాడలేదు.

భగవాన్ బిర్సా ముండా మన స్వాతంత్య్ర పోరాట ధృవతార . భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముండాలు, ఒరాన్లు, సంతలు, తామర్లు, కోల్లు, భిల్లులు, ఖాసీలు, కోయలు మిజోస్టో వంటి అనేక గిరిజన తెగలు బలపరిచాయి.

గిరిజన సంఘాలు నిర్వహించిన విప్లవ ఉద్యమాలు, పోరాటాలు వారి అపారమైన ధైర్యం మరియు అత్యున్నత త్యాగాల వల్ల చిరస్మరణీయం అయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ప్రేరణను కలిగించాయి. ఏదేమైనప్పటికీ ఏ కారణాల వల్లనైనా, చరిత్రకారులు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వారి అపారమైన సహకారానికి సముచిత న్యాయం చేయలేకపోయారు.

కానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దార్శనికతతో భారతీయులందరూ “ఆజాదికా అమృత మహోత్సవ్‌”ను జరుపుకోవాలని భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వంటి మరెందరో కీర్తికి నోచుకోని వీరుల పరాక్రమాన్ని, త్యాగాలను అధ్యయనం చేసి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మన ప్రధాని క్రియాశీల నాయకత్వంలో ఇప్పుడు మొదటిసారి భగవాన్ బిర్సా ముండా జయంతి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్‌ని ఈ సందర్భంగా జరుపుకోవడం గిరిజనుల ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ స్వతంత్ర పోరాటంలో వారి సహకారం గుర్తిస్తూ ప్రభుత్వం సముచితమైన నివాళిని అర్పిస్తోంది.

ఈ జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, భారతీయ సమాజ విలువలు, ఆతిథ్యం, జాతీయత పెంపొందించడం కోసం భారతదేశంలోని గిరిజనులు సలిపిన కృషిని సదా గుర్తుచేసుకుందాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *