Breaking News

ఆపన్నులకు అండగా ప్రజా ప్రభుత్వం…ప్రతి కుటుంబానికి భరోసా…

-20 మంది లబ్ధిదారులకు ₹12.27 లక్షల CMRF చెక్కుల పంపిణీ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ అందించారు. యూసుఫ్‌గూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం ₹12,27,500 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *