Breaking News

గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికారులు, నిర్వాహకులు, ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎంపీలు, రాష్ట్ర పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *