-ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరిస్తూ సంపదకేంద్రాలకు తరళిస్తున్నాం ..
-జగనన్న పాలవెల్లువపై మహిళా పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం ..
-జాయింట్ కలెక్టరు ( అభివృద్ధి ) ఎల్. శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్పం, స్వచ్ఛ సర్వేక్షణ పంచాయితీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పలు పథకాలకు సంబందించిన పనుల పురోగతిని వేగవంతం చేస్తున్నామని జాయింట్ కలెక్టరు( అభివృద్ధి) ఎల్. శివశంకర్ పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండేకు వివరించారు. తాడేపల్లి పంచాయితీరాజ్ రూరల్ డవలప్మెంట్ కమిషనరేట్ నుంచి శుక్రవారం స్పెషల్ కమీషనర్ శాంతి ప్రియా పాండే పంచాయితీరాజ్ రూరల్ డవలఫ్మెంట్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు జాయింట్ కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరు ( అభివృద్ధి ) ఎల్. శివశంకర్, జెడ్పీ, సీఈవో, డీపీవో డ్వామా పీడీ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగనన్న స్వచ్ఛ సంకల్పం, స్వచ్ఛ సర్వేక్షణ, జగనన్న పాలవెల్లువ, వైఎస్సార్ జలకల, ఎస్ఆర్ఆ జిఎస్, ఓటీఎస్, స్పందన పంచాయితీరాజ్ చేపట్టిన పలు ప్రభుత్వ పథకాల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) ఎల్. శివశంకర్ వివరిస్తు జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రాలకు తరలించి సంపదగా మార్చే ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలో చెత్త రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు మండల గ్రామ స్థాయి అధికారులు ప్రణాళికా బద్దంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు చేస్తూ క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ఎన్జీవోలు , ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని మన ఊరు – మన శుభ్రత అనే అంశంపై గ్రామాల్లో ర్యాలీను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో బిస్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టామన్నారు . క్లాప్ మిత్ర సిబ్బంది ప్రతి రోజు గార్బేజ్ ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి చెత్త నిల్వ కేంద్రాలకు తరళించే విధంగా అధికారులు పర్యవేక్షణ లో జరుగుతుందన్నారు. క్లాప్ మిత్ర సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించి గార్బేజ్ ను యార్డుకు తరలించిన అనంతరం జగనన్న స్వచ్ఛ సంకల్పం యాప్ లో అప్ లోడ్ చేయించే విధంగా గ్రామ, మండల స్థాయి అధికారుల చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పాలవెల్లువ పై ఎంపిక చేసిన గ్రామాల్లో మహిళా పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నామని జాయింట్ కలెక్టరు శివశంకర్ వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు , డీపీవో జ్యోతి , డ్వామా పీడీ సూర్యనారాయణ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News