Breaking News

“సామాన్యుల దృక్కోణాన్ని జాతీయ స్థాయిలో వ్యక్తీకరించడానికి యువతకు జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ ఒక అవకాశం”… : బి జె ప్రసన్న

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు వారి ఆధ్వర్యంలో శనివారం జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమం లో భాగంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల వారికి జిల్లా స్థాయి లో ప్రధమ మరియు ద్వితీయ స్థానాల ఎంపిక కొరకు ఈ రోజు అనగా 19 -02 -2022 న ఉదయం 9:30 గంటల నుండి వర్చ్యువల్ పద్దతిలో ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ స్వాస్థ్య భారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు ఇన్క్రెడిబుల్ ఇండియా అంశాలపై వకృత్వ పోటీలు నిర్వహిచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముఖ్య అతిధి గా పాల్గొని పోటిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు యువకులు దైర్యంగా స్థిరంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలని వారి వాణి దేశ వ్యాప్తంగా వినిపించిన నాడు వారి అభిప్రాయాలూ చట్ట సభలలోను పరిగణన లోకి తీసుకొనే అవకాశం ఉంటుందని అందువల్ల ప్రతిఒక్కరు తమ అభిప్రాయాలను నిష్పక్షపాతం గా వినిపించాలని, నెహ్రూ యువ కేంద్ర సంఘఠన్ అధికారులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, యువ జన సంఘాల సభ్యులు ఇందుకు కృషి చేయాలనీ కోరారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల యువత ప్రజా సమస్యలతో నిమగ్నమవ్వడానికి, సామాన్యుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి, వారి అభిప్రాయాలను రూపొందించడానికి మరియు దానిని స్పష్టంగా వ్యక్తీకరించడానికి మరియు ప్రోత్సహించడానికి యువత ఇప్పటినుంచే అవలంబిస్తారని అన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన వారికి 2 లక్షలు ద్వితీయ స్థానం సాధించిన వారికీ 1.5 లక్షలు, అలాగే తృతీయ స్థానం సాధించిన వారికి 1 లక్ష అలాగే 2 కన్సోలేషన్ బహుమతులు 50 ,౦౦౦ రూపాయలు మరియు ప్రశంస పత్రాలు అందజేస్తారు అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమములో నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కు.కిరణ్మయి దేవిరెడ్డి అధ్యక్షత వహించగా , జ్యూరీ సభ్యులు గా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాము ఆఫీసర్ డా. సి హెచ్ ప్రవీణ్, డి బి ఎచ్ పి సభ అసోసియేట్ ప్రొఫెసర్ పి యై బి ఎల్ ప్రసూనా, అసోసియేట్ డా. ఎం శ్రీహరి, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాని, సైకాలజిస్ట్ల విజయలక్ష్మి పరిమి వ్యవహరించగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా ల నుంచి మొత్తం 120 మంది పోటీలో పాల్గొనగా వారిలో నుండి ఆయా జిల్లాల వారీగా ఇద్దరిని ప్రధమ మరియు ద్వితీయ స్థానాలకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పోటీలకు పంపడం జరుగగా పాల్గొన్నవారందరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *