కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, తదితరుల ఆధ్వర్యంలో కొవ్వూరు లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా అర్హులైన వారందరికీ అందచేయ్యడం జరిగిందన్నారు. శాసన మండలి చైర్మన్ గా నన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసి, దళితులకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చినందున దళితులు పక్షన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గము తో తన అనుబంధం విడదీయలేనిదని ఆయన పేర్కొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఎంతో దగ్గరకు తీసుకుని కొవ్వూరు నుంచి శాసన సభ్యునిగా సిటు ఇచ్చారని తెలిపారు. అయితే నాకు కొవ్వూరు ప్రజలు ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారని, ఈరోజు మీ మధ్యలో నాకు సన్మానం చెయ్యడం మరచిపోలేని క్షణాలన్నారు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని మోషేన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు, శాసన సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, మండలి ఛైర్మన్ గా మోషేన్ రాజు అభినందిస్తూ, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు వైఎస్సార్ పార్టీ లో తగిన గౌరవం దక్కుతుంది అనడానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథమహారధులు ముఖ్యఅతిథిలుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఎం.పి. భరత్ రామ్, జెడ్ పి. ఛైర్మెన్, కవురు శ్రీనివాస్, ఎం.యల్.ఏ లు, జి.శ్రీనివాస నాయుడు, తలారి వెంకట్రావు, కారుమూరి వెంకట నాగేశ్వర రావు, జెడ్. పి. టి. సి. యం.పి.పి లు, పరిశ్రమల సలహాదారులు, కొవ్వూరు మునిసిపల్ ఛైర్పర్శన్, బావన రత్నకుమారి రాజీవ్ కృష్ణ విచ్చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News