-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు…
-43 షాపులలో తనిఖీలు, 21 కేసులు నమోదు
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసర సరుకులను ఎమ్మార్పీ ధరల కన్నా అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ, పౌరసరఫరాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జి.కొండూరు,మైలవరం,ఆగిరిపల్లి, నూజివీడు, హనుమాన్ జంక్షన్, విజయవాడ నగరంలోని 43 నిత్యావసర సరుకుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఎంఆర్ పి కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాల్లో 21 కేసులను నమోదు చేశామన్నారు.ముఖ్యంగా వంటనూనెలను ఎంఆర్పి కన్నా ధరలకు విక్రయిస్తున్నట్లూ తనిఖీలలో గుర్తించామన్నారు.కందిపప్పు,మినపప్పు, నూనెలను అక్రమంగా నిల్వచెసి బహిరంగ మార్కెట్లో కృతిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు జరిపే దుకాణాల పై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.