విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతరత్న డా. బిఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక స్వరాజ్ మైదానంలో ఏర్పాటుచేసిన 25 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నమూనా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఘనంగా నివాళులు అర్పించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తోపాటు పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్,రాష్ట్ర సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర్ రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఉన్నారు. అనంతరం స్వరాజ్ మైదానంలో 18.81 ఎకరాలలో రూ.179.63 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం, దానికి అనుబంధంగా ల్యాండ్ స్కైప్, కన్వెన్షన్ సెంటర్, మెడిటేషన్ హాల్ తదితర నిర్మాణ పనులను ఏపీఐఐసీ అధికారులు, కె పి సి ప్రాజెక్ట్ ఏజెన్సీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసి సిద్ధం చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశించారు.
Tags vijayawada
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …