Breaking News

పది పరీక్షా ఫలితాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి…

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ డిమాండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అతి తక్కువ మంది ఉత్తీర్ణత కావడం దురదృష్టకరమని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ పాఠశాలలో 50 శాతం మంది ఉత్తీర్ణులు కావటం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. 71 శాతం ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్లీర్ణులు కాకపోవటం సిగ్గు చేటన్నారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని ఆయన విమర్శించారు. తక్షణం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *