విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న39 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.19-6-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురించడమైనదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై (ఆధార్ కార్డులోని పుట్టిన తేది మరియు 10 వ తరగతి సర్టిఫికేట్ లోని పుట్టిన తేదీ ఒకటై ఉండవలెను), తేది. 31-5-2022 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండి, 35 సంవత్సరములు మించని వారై ఉండవలెనని తెలిపారు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు చిరునామా సంబంధిత మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఉండవలెనని, ది.20-6-2022 నుండి 23-6-2022 వరకు ఆన్లైన్ ద్వారా http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer 090420201049.vt వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొనవచ్చునని పేర్కొన్నారు. ది.24-6-2022 న ఆన్ లైన్ నందు దాఖలైన దరఖాస్తులను పరిశీలించి, 25-6-2022 నుండి 27-6-2022 వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయబడునని తెలిపారు. ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు ది.1-7-2022 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.
Prajavartha Online Telugu News