విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ది.21.06.2022 న నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ కరపత్రమును శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చే ప్రారంభించడమైనది. విజయవాడ నగరపాలక సంస్థ మరియ్గు యోగా స్పోర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్ అఫ్ కృష్ణ జిల్లా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సూర్య సంకల్ప యోగ ఆయుష్ వార్ల సంయుక్త అద్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ డోర్ స్టేడియం నందు జరుగు కార్యక్రమములో ప్రజలందరూ విరివిరిగా పాల్గొని విజయవంతము చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ రమేష్ బాబు, యోగా శిక్షకులు సూర్యచంద్ర కుమారి, వి,స్వాతి WHRC, రాష్ట్ర జనరల్ సెక్రటరి మరియు కృష్ణ యోగా అసోసియేషన్ ISR ఆంజనేయులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News