Breaking News

భూగర్భ జలాలను కాపాడుకోవలసిన భాద్యత మనందరిది

-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నీరు వృధా కాకుండా పడిన నీరు అంతయు భూమిలోకి ఇంకేవిధంగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్ ను నిర్వహించాలని అన్నారు. మనిషి నాగరికత నదీ తీరాలలోనే ప్రారంభమైనదని, పంచభూతాలలో నీటికి విశిష్ట స్థానం కలదని జలమే జీవనాధారం ప్రతి నీటి చుక్క విలువైనదని దానిని కాపాడు కోవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై గలదని, భవన నిర్మాణదారులు తప్పక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొనే విధంగా వారికీ అవగాహన కల్పించే కార్యక్రమము చేపట్టబడినదని, భూగర్భ జలాలు పెంపొందించు విధంగా నీటి వృధాను అరికట్టి సమర్దవంతముగా నీటిని వినియోగించుకొనే విధంగా మార్పు తీసుకురావటానికి నగరపాలక సంస్థ కార్యాచరణతో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్ మరియు ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *