Breaking News

నగరాన్ని పరిశుభ్రముగా తీర్చిదిద్దాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ పద్దతులను అనుసరించుచు నగరాన్ని పరిశుభ్రముగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగర ప్రజలకు చెత్త సేకరణ సమయంలో ఇ-వేస్ట్ ను వేరు చేసి అందించు ప్రక్రియ పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంగా యం.జి రోడ్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమములో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్., సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు  మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధముల వల్ల కలుగు అనర్ధముల పట్ల ప్రజలకు అవగాహన కల్పించుటకు నగరపాలక సంస్థ మంచి ప్రణాళికలతో ముందుకు వెళుతుందని, రాబోవు రోజులలో విజయవాడ నగరం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సాధించుటకు నగర ప్రజలు సహకారం అందించాలని అన్నారు. అదే విధంగా సింగ్ నగర్ ప్రాంతములో PPP పద్ధతిన ప్రారంభించిన ఇ- వేస్ట్ మరియు ఫ్లవర్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభించుకోవటం జరిగిందని వీటి వల్ల నగరంలో కాలుష్యాన్ని తగ్గించి విజయవాడ నగరం ఒక మోడల్ నగరంగా రూపాంతరం చెందుతుందని ఆకాంక్షించారు.

అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో పూల మార్కెట్లు మరియు అనేక కళ్యాణ మండపములు వారు పూలవ్యర్ధములను కాలువగట్ల వెంబడి లేదా డంపింగ్ యార్డ్ ల యందు పడవేయుట జరుగుతుందని, విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా అనేక సంస్కరణలను అమలు చేస్తుందని అన్నారు. ప్రధానంగా నగరంలో ఉత్పత్తి ఆగుతున్న ఫ్లవర్ వేస్ట్ నుండి అగురబత్తి తయారు చేయుట ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం సమకుర్చుటయే కాకుండా నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుటకు అవకాశం ఉంటుందని అన్నారు.

సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా ప్రతి ఇంటి వారు చెత్త సేకరణ సమయంలో ఫ్లవర్ వేస్ట్ మరియు ఇ- వేస్ట్ లను వేరు చేసి అందించవలేనని, సదరు వ్యర్ధములను ఈ విధమైన రీసైక్లింగ్ యూనిట్ లలో దూప్ స్టిక్స్ వంటి సుగంద పరిమళాలు వెదజల్లు ఉత్పత్తులను తయారు చేయుట జరుగునని అన్నారు. దీనిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సోలుషన్స్ వారి సహకారంతో నివాసాలు, ఫ్లవర్ మార్కెట్స్, దేవాలయాలు మరియు కళ్యాణ మండపాలలో ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న పూలవ్యర్ధములను, విద్యా సంస్థలు, కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణముల సంస్థల నుండి వచ్చు ఇ- వేస్ట్ బ్యాటరీలు, హెడ్ ఫోన్, సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్ధముల ద్వారా ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు వెలువడి ఆరోగ్యమునకు భంగం కల్గించునని వీటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేయుట ద్వారా సక్రమ పద్దతిలో ఈ కేంద్రము ద్వారా రీసైక్లింగ్ చేయటం జరుగుతుందని తద్వారా పర్యావరణమును రక్షించుకొన వచున్నని అన్నారు.

ముందుగా సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో పి.పి.పి. పద్దతిలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ వేస్ట్, ఇ-వేస్ట్ మేనేజ్ మెంట్ సెంటర్ ప్రారంభ కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంచి దుర్గ, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *